అన్ స్టాపబుల్-2 తాజా ఎపిసోడ్ లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర అంశాల వెల్లడి
- బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్-2
- తాజా ఎపిసోడ్ కు కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ రెడ్డి, రాధిక హాజరు
- వైఎస్ హెలికాప్టర్ ఘటన ముందు పరిస్థితులు వివరించిన కిరణ్
నాడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అంశాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో తాను కూడా అదే హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉందని, కానీ ఆ సమయంలో అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న తాను పలు కమిటీల నియామకాలతో బిజీగా ఉన్నందున వెళ్లలేకపోయానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
అసెంబ్లీ ముగింపు వేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఫోన్ చేశారని, అకౌంట్స్ కమిటీకి శోభా నాగిరెడ్డి పేరును సూచించారని గుర్తు చేసుకున్నారు. మరుసటి రోజు వివిధ సభా సంఘాల ప్రకటన చేయాల్సి ఉండడంతో వైఎస్ తో ఆ హెలికాప్టర్ లో వెళ్లలేకపోయానని వివరించారు. ఆ రోజున హెలికాప్టర్ లో వెళ్లకపోవడంతో బతికానని, బతికుండబట్టే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానని కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు.