కార్తితో తలపడే విలన్ గా లారెన్స్?
- హారర్ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ లారెన్స్
- ఆయన హీరోగా రూపొందుతున్న 'చంద్రముఖి 2'
- 'ఖైదీ 2' కోసం ఆయనను సంప్రదించిన లోకేశ్
- విలన్ గా చేయడానికి ఓకే చెప్పిన లారెన్స్
వచ్చే ఏడాదిలో కార్తి 'ఖైదీ 2' సినిమా చేయనున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా లారెన్స్ కనిపించనున్నట్టు ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు.
ప్రస్తుతం లారెన్స్ 'చంద్రముఖి' సీక్వెల్ లో చేస్తున్నాడు. పి. వాసు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. హారర్ కామెడీ చిత్రాల పరంగా లారెన్స్ కి గల క్రేజ్ ఈ సినిమాకి కలిసొస్తుందని వాసు భావిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.