తెలుగు తెరకి పరిచయమవుతున్న మరో బ్యూటీ!
- అందాల రాశిగా మానుషి చిల్లార్ కి పేరు
- ఈ ఏడాదిలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ
- వరుణ్ తేజ్ 13వ సినిమాతో టాలీవుడ్ లో ఛాన్స్
- వచ్చేనెలలో సెట్స్ పైకి వెళుతున్న ప్రాజెక్టు
ఈ నేపథ్యంలోనే మరో ముంబై భామ పేరు తాజాగా వినిపిస్తోంది. ఆ ముద్దుగుమ్మ పేరే 'మానుషి చిల్లార్'. పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన ఈ సుందరి, 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. తాజాగా ఆమె ఒక తెలుగు సినిమాను అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అదీ వరుణ్ తేజ్ సరసన.
వరుణ్ తేజ్ హీరోగా ఆయన 13వ సినిమా పట్టాలెక్కనుంది. బడా నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి, శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించనున్నాడు. తెలుగులో ఆయనకి ఇదే మొదటి సినిమా. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ యాక్షన్ డ్రామాతోనే మానుషి చిల్లార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.