రేపు హైదరాబాద్ కు జగన్... కృష్ణకు నివాళి అర్పించనున్న ఏపీ సీఎం
- అనారోగ్యంతో మరణించిన సూపర్ స్టార్ కృష్ణ
- కృష్ణకు నివాళి అర్పించేందుకే హైదరాబాద్ కు జగన్
- పద్మాలయ స్టూడియోలో కృష్ణకు నివాళి అర్పించనున్న జగన్
ఈ క్రమంలో కృష్ణ అంత్యక్రియలకు ముందే హైదరాబాద్ కు రానున్న జగన్... నేరుగా పద్మాలయ స్టూడియోకు వెళతారు. అక్కడే ఆయన కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పిస్తారు. కృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శిస్తారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లి వెళతారు. కృష్ణ భార్య ఇందిరా దేవి మరణించినప్పుడు కూడా హైదరాబాద్ కు వచ్చిన జగన్... కృష్ణను పరామర్శించిన సంగతి తెలిసిందే.