కృష్ణ పార్థివదేహం వద్ద భోరున విలపించిన మోహన్ బాబు
- కృష్ణ భౌతికకాయాన్ని చూసి చలించిపోయిన మోహన్ బాబు
- శవపేటికను పట్టుకుని వెక్కివెక్కి ఏడ్చిన వైనం
- తట్టుకోలేకపోతున్నానని కంటతడి
అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు కృష్ణనే తనను పైకి తీసుకొచ్చారని తెలిపారు. కృష్ణతో కలిసి 70కి పైగా సినిమాల్లో నటించానని, కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశానని చెప్పారు. కృష్ణగారి మరణాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.