కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన వెంకయ్యనాయుడు, చంద్రబాబు, కేటీఆర్ తదితరులు
- మహేశ్ బాబును ఓదారుస్తున్న ప్రముఖులు
- పక్కనే కూర్చొని ధైర్యం చెప్పిన చిరంజీవి
- వెంకటేశ్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, బన్నీ తదితరుల నివాళి
మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, దర్శకులు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, మంచు విష్ణు తదితరులు కూడా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చిరంజీవి, వెంకటేశ్ చాలాసేపు మహేశ్ బాబు పక్కనే కూర్చొని ధైర్యం చెప్పారు. త్రివిక్రమ్.. మహేశ్ పక్కనే ఉన్నారు. నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కృష్ణ నివాసంలోనే ఉండి ప్రముఖులను రిసీవ్ చేసుకుంటున్నారు.


