ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కానున్న హన్సిక పెళ్లి?
- వచ్చే నెల 4న హన్సిక పెళ్లి
- సొహైల్ ను ప్రేమ వివాహం చేసుకుంటున్న హన్సిక
- ఇప్పటికే ప్రారంభమైన పెళ్లి పనులు
మరోవైపు వీరి పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరి వివాహ వేడుక ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన ఇంకా వెలువడలేదు. గతంలో నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్లి కూడా నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, ఆ వీడియో ఇంతవరకు విడుదల కాలేదు.