నాని నిర్మాతగా 'మీట్ క్యూట్' వెబ్ సిరీస్ .. సోనీలివ్ లో
- నాని నిర్మాతగా వెబ్ సిరీస్
- దర్శకురాలిగా నాని సోదరి దీప్తి
- రిలేషన్స్ .. ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ
- త్వరలో సోని లివ్ లో స్ట్రీమింగ్
నాని సోదరి దీప్తి ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించడం విశేషం. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను సోని లివ్ వారు దక్కించుకున్నారు. కొంత సేపటి క్రితం ఈ వెబ్ సిరీస్ నుంచి ఒక టీజర్ ను వదిలారు. జీవితంలో తారసపడే కొంతమంది వ్యక్తులు .. కొన్ని పరిచయాలు .. ప్రేమలు .. బంధాలు .. వాటి మధ్య నడిచే ఎమోషన్స్ ప్రధానంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుందనే విషయం అర్థమవుతోంది.
సత్య రాజ్ .. శివ కందుకూరి .. రోహిణి .. ఆకాంక్ష సింగ్ .. ఆదా శర్మ ... వర్ష బొల్లమ్మ వంటి ఆర్టిస్టులు ఈ టీజర్ లో కనిపించారు. టీజర్ చూస్తుంటే .. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ కంటెంట్ కనెక్ట్ అయ్యేలా అనిపిస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ కూడా రానుంది.