మోదీని పవన్ కలిస్తే మాకేంటి?: మంత్రి బొత్స
- విశాఖలో నేడు మోదీ, పవన్ సమావేశం
- స్పందించాలంటూ బొత్సను కోరిన మీడియా
- రాజకీయాల్లో ఇలాంటి భేటీలు రొటీన్ అని పేర్కొన్న బొత్స
- భూతద్దంలో చూడాల్సిన అవసరంలేదని వెల్లడి
రాజకీయల్లో ఇలాంటి భేటీలు సహజమేనని అభిప్రాయపడ్డారు. నేతలు ఒకరినొకరు కలుసుకోవడంలో ఆశ్చర్యమేముందని, రాజకీయాల్లో ఇవి రొటీన్ అని అన్నారు. మోదీతో పవన్ సమావేశమైతే తామెందుకు స్పందించాలని బొత్స ప్రశ్నించారు. ఈ భేటీని భూతద్దంలో చూడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.
గతంలో పవన్ ఢిల్లీలో మోదీని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ దొరకలేదు అంటూ ఓ మీడియా ప్రతినిధి బొత్సను అడగ్గా, అవన్నీ ఆయా పార్టీల అంతర్గత వ్యవహారాలు అని, వాటిపై తామెలా స్పందిస్తామని బొత్స బదులిచ్చారు. 'నేనేమైనా వారి పార్టీకి సంబంధించిన వాడ్నా... అలాంటి విషయాలపై నేను మాట్లాడను' అని కరాఖండీగా చెప్పేశారు.