అఖిల్ కి హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది: వినాయక్
- మాస్ యాక్షన్ డైరెక్టర్ గా వినాయక్ కి పేరు
- 'అఖిల్' సినిమాను గురించి ప్రస్తావించిన వినాయక్
- అఖిల్ పై ఎక్కువ బరువు పెట్టేశానంటూ వ్యాఖ్య
- ఏదో ఒక రోజున తను సూపర్ స్టార్ అవుతాడంటూ కితాబు
'అఖిల్' సినిమాను గురించి మాట్లాడుతూ .. 'అఖిల్' సినిమా విషయంలో మేము అనుకున్నది జరగలేదు. దాంతో బయ్యర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, పెద్ద ఎమౌంట్ ను సెట్ చేసి వాళ్లకి సర్దుబాటు చేశాను. నా బాధ డబ్బు గురించి కాదు. నేనంటే అంత ఇష్టపడే అఖిల్ కి హిట్ ఇవ్వలేకపోయానే అనిపించింది. ఇప్పటికీ ఆ బాధ అలాగే ఉంది" అన్నాడు.
ఎంచుకున్న కథ బాగోలేకపోవడమో .. ఆ కథతో అఖిల్ పై ఎక్కువ బరువు పెట్టేయడమో జరిగింది. రిలీజ్ విషయంలో కూడా కొంచెం హడావిడి అయింది. ఇలా ఎన్నో కారణాల ప్రభావం ఆ సినిమాపై పడింది. ఆ సినిమా వలన మా సాన్నిహిత్యం ఏమీ దెబ్బతినలేదు. ఇప్పటికీ తను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఏదో ఒక రోజున మాత్రం తాను సూపర్ స్టార్ అవుతాడనే నమ్మకం నాకు బలంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.