విజయసాయిరెడ్డి అల్లుడి అన్నను ఈడీ అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు?: పంచుమర్తి అనురాధ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్
- విజయసాయి అల్లుడి అన్నే శరత్ అన్న అనురాధ
- మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని మండిపాటు
ఇక శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయడంపై వైసీపీ నేతలు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. మద్య నిషేధంపై గొప్పలు చెప్పే జగన్ ఈ అరెస్ట్ పై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం అయిన తర్వాత అంచెలంచెలుగా మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. మూడున్నరేళ్లుగా శాండ్, మైన్, వైన్, ఇసుక, మద్యం, బియ్యం, అంబులెన్స్ మాఫియాలు నడిపిన జగన్ రెడ్డి వైద్య రంగం, ప్రజారోగ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.
కోవిడ్ సమయంలో రోగులకు భోజనం సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని జగన్ రెడ్డి ప్రజారోగ్యం కాపాడతారా? అని అనురాధ ఎద్దేవా చేశారు. చివరకు కోవిడ్ మరణాలపైనా తప్పుడు లెక్కలు చెప్పి కోట్లు స్వాహా చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని దుయ్యబట్టారు. నిత్యం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తపించిన చంద్రబాబు గారికి, కోవిడ్ మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన నిధులనూ కొట్టేసిన జగన్ రెడ్డికి పోలికా? అని ప్రశ్నించారు. ఫోన్ చేయగానే కుయ్ కుయ్ మంటూ వస్తాయన్న అంబులెన్స్ ల జాడ లేక బిడ్డల శవాలను భుజాలపై వేసుకెళుతున్న ఘటనలు జగన్ రెడ్డికి కనిపించడంలేదా? అని అడిగారు.