ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీం సంచలన నిర్ణయం.. రూ.వంద కోట్ల తో మళ్లీ వీఎఫ్ఎక్స్ పనులు!
- గత నెలలో విడుదలైన టీజర్ పై తీవ్ర విమర్శలు
- గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని ప్రేక్షకుల అసంతృప్తి
- భారీ ఖర్చుతో సాంకేతిక తప్పిదాలను సరిచేసే పనిలో చిత్ర బృందం
- సంక్రాంతికి బదులు వేసవిలో విడుదల కానున్న ప్రభాస్ కొత్త చిత్రం
వీఎఫ్ ఎక్స్, సీజీ వర్క్స్ లో తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఏకంగా రూ. వంద కోట్ల ఖర్చుతో వీఎఫ్ ఎక్స్ షాట్స్ ను సరి చేస్తోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రం విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ మేరకు పోస్టర్స్, టీజర్ లో విడుదల తేదీని వెల్లడించింది. కానీ, ఇప్పుడు వీఎఫ్ ఎక్స్ తప్పులు సరి చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సంక్రాంతికి బదులు వేసవిలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చిత్రం విడుదల వాయిదా పడుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర బృందం తొందర్లోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.