చరణ్ .. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు లేనట్టే!
- శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చరణ్
- గౌతమ్ తిన్ననూరితో చేయవలసిన సినిమా కేన్సిల్
- అతని హిందీ 'జెర్సీ' ఫ్లాప్ కావడమే కారణమంటూ టాక్
- విజయ్ దేవరకొండతో గౌతమ్ సినిమా ఉండే ఛాన్స్
గౌతమ్ తిన్ననూరి తొలి సినిమా అయిన 'జెర్సీ'తో సూపర్ హిట్ అందుకున్నాడు. అదే కథను హిందీలో రీమేక్ చేశాడు. అయితే అక్కడ ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. ఈ లోగా చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అందువలన గౌతమ్ కథ పాన్ ఇండియా స్థాయిలో లేదనే కారణంగా చరణ్ ఆసక్తి చూపకపోవడం జరిగిందని అంటున్నారు.
ఈ కారణంగానే చరణ్ - గౌతమ్ కాంబినేషన్ కి ఆదిలోనే అడ్డుకట్ట పడింది. శంకర్ తరువాత చరణ్ ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనేది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక గౌతమ్ తిన్ననూరి మాత్రం దిల్ రాజు నిర్మాతగా ... విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.