'తగ్గేదే లే' నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్!
- విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'తగ్గేదేలే'
- నవీన్ చంద్ర సరసన అనన్య రాజ్ - దివ్య
- సంగీత దర్శకుడిగా చరణ్ అర్జున్
- ఈ నెల 4వ తేదీన సినిమా విడుదల
దండుపాళ్యం బ్యాచ్ .. లవర్స్ ను టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథ. లవర్స్ గా నవీన్ చంద్ర .. అనన్య రాజ్ .. దివ్య పిళ్లై కనిపించనున్నారు. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతాన్ని సమకూర్చాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'ఇదే ఇదేనే ఇదే ఇదేనే నేనెదురు చూసినది ఇదే ఇదేనే' అంటూ ఈ పాట సాగుతోంది.
యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ రొమాంటిక్ సాంగును చిత్రీకరించారు. చరణ్ అర్జున్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను హరిచరణ్ - మనీషా ఆలపించారు. మకరంద్ దేశ్ పాండే .. పూజా గాంధీ .. నాగబాబు ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 4వ తేదీన థియేటర్లకు రానుంది.