దేవేంద్ర ఫడ్నవిస్ కు సవాల్ విసిరిన ఆదిత్య థాకరే
- ఎయిర్ బస్ ప్రాజెక్టు గుజరాత్ కు ఎందుకు వెళ్లిందని ఆదిత్య ప్రశ్న
- కేంద్రం స్వార్థపూరిత నిర్ణయం వల్ల వెళ్లిపోయిందని విమర్శ
- రాష్ట్ర ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేదని వ్యాఖ్య
కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఎయిర్ బస్ ప్రాజెక్టును టాటా సంస్థ గుజరాత్ కు తరలించినట్టు తమకు విశ్వనీయ సమాచారం ఉందని తెలిపారు. అంతేకాదు, ఈ విషయంపై ముఖాముఖి చర్చకు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వస్తారా? అని ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయి పెట్టుబడి కూడా అత్యంత ముఖ్యమైనదని చెప్పారు. డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ తప్పు చేశారని కానీ, మహారాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని కానీ తాను చెప్పడం లేదని.. అయితే, రాష్ట్ర ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేదని తాను చెపుతున్నానని అన్నారు.