నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులను తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదంటూ పూరి జగన్నాధ్ లేఖ విడుదల
- లైగర్ నిరాశ తర్వాత ఒత్తిడిలో జగన్నాథ్
- నష్టాలను భరించాలని డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి
- జీవిత సత్యాలను వివరిస్తూ పూరీ బహిరంగ లేఖ
విజయం, అపజయం, జీవితం గురించి తనదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇవేవీ శాశ్వతం కాదన్నారు. ప్రతి సంఘటనని మనం అనుభవంలానే చూడాలన్నారు. లైఫ్ లో రిస్క్ చెయ్యకపోతే అది జీవితమే కాదన్నారు. తన మీద నమ్మకంతో టికెట్ కొని సినిమాకు వచ్చిన ప్రేక్షకులను తప్పితే తాను ఎవ్వరినీ మోసం చేయలేదని పూరీ స్పష్టం చేశారు. మళ్లీ ఇంకో సినిమా తీస్తా.. కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తానని అభిమానులకు భరోసా ఇచ్చారు. జీవితంలో చివరగా అందరూ కలిసేది శ్మశానంలోనే అని, మధ్యలో జరిగేది అంతా డ్రామా అని జీవిత సత్యం వివరించారు. ఈ లేఖను బండ్ల గణేష్ తదితరులు ట్విట్టర్ లో షేర్ చేశారు.