'భీష్మ' దర్శకుడితో బాలయ్య!
- షూటింగు దశలో బాలయ్య 'వీరశంకర్ రెడ్డి'
- రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
- తరువాత ప్రాజెక్టు అనిల్ రావిపూడితో
- లైన్లో వెంకీ కుడుముల
అయితే బాలకృష్ణకి కూడా ఒక కథను చెప్పి ఒప్పించడంలో వెంకీ కుడుముల సక్సెస్ అయ్యాడనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఈ కథ నడుస్తుందనీ, కథ వినగానే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి' చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడితో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఇది తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన కథ. ఈ సినిమా తరువాతనే ఆయన వెంకీ కుడుములతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మరి వెంకీ కుడుముల ముందుగా చిరూ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడా? లేదంటే బాలయ్యతో చేస్తాడా? అనేది చూడాలి.