కెన్యాలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ కాల్చివేత
- ధ్రువీకరించిన షరీఫ్ భార్య
- తమ కుటుంబ ఫొటోలు, వ్యక్తిగత వివరాలు షేర్ చేయొద్దని విన్నపం
- ప్రాణాలకు ముప్పు ఉండడంతో పాక్ నుంచి దుబాయ్‌కు షరీఫ్
- అక్కడ కూడా వెంటాడుతుండడంతో కెన్యాకు
షరీఫ్‌ను హత్యకు ఆఫ్ఘన్ హంతకులు పథకం పన్నారని ఆయన స్నేహితులు చెబుతున్నారు. షరీఫ్ నైరోబీ శివారులో హత్యకు గురయ్యారు. ఉద్దేశపూర్వకంగా తలలో కాల్చి చంపినట్టు చెబుతున్నారు. షరీఫ్ హత్యపై కెన్యాలోని పాకిస్థాన్ హై కమిషన్ వివరాలు సేకరిస్తోంది. షరీఫ్ హత్యను ధ్రువీకరించుకున్న తర్వాత అధికారులతో కలిసి కెన్యాలో పాకిస్థాన్ రాయబారి నైరోబీలోని కిరోమో ఫ్యునెరల్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ షరీఫ్ మృతదేహాన్ని గుర్తించారు. అర్షద్ షరీఫ్ మృతిపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ కూడా సంతాపం తెలిపారు.