రెండు, మూడు రోజుల్లో టీఆర్ఎస్ లో చేరనున్న రాపోలు ఆనంద భాస్కర్
- ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన రాపోలు
- నేతన్నల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను ప్రశంసించిన వైనం
- చేనేత పరిశ్రమను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శ
చేనేత ఉత్పత్తులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధిస్తుండటాన్ని ఆయన విమర్శించారు. చేనేత పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఈ క్రమంలో బీజేపీలో చేరేందుకు ఆయన సుముఖతను వ్యక్తపరిచారు. అంతా ఓకే అయితే రెండు, మూడు రోజుల్లోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.