ఓటీటీ సెంటర్స్ లో దీపావళి సందడి మొదలైనట్టే!
- ఈ దీపావళికి థియేటర్లలో దిగుతున్న నాలుగు సినిమాలు
- 'సోనీ లివ్' లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఒకే ఒక జీవితం'
- ఈ నెల 24వ తేదీన నుంచి 'ఆహా'లో 'స్వాతిముత్యం'
- ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ
ఇక ఓటీటీ వైపు చూస్తే .. శర్వానంద్ హీరోగా చేసిన 'ఒకే ఒక జీవితం' స్ట్రీమింగ్ ఈ రోజునే 'సోనీ లివ్'లో మొదలైంది. జీవితంలో చేసిన కొన్ని పొరపాట్లను గతంలోకి వెళ్లి సరిచేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందనే ఒక కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకి, థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అమల అక్కినేని ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
అలాగే దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్వాతి ముత్యం' కూడా దీపావళికి 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వస్తోంది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను 'ఆహా' నుంచి వదులుదామని అనుకున్నారు. కానీ మరో నాలుగు రోజులు ముందుకు జరిపి, ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ జరగనున్నట్టు ప్రకటించారు. బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా, సరైన పబ్లిసిటీ లేక వెనుకబడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ రావడం ఖాయమని చెప్పచ్చు.
.