ఏపీ ఇంచార్జి సీఎస్ గా విజయానంద్... ఆర్ అండ్ బీకి ప్రవీణ్ ప్రకాశ్
- అనారోగ్యంపాలైన సమీర్ శర్మ స్థానంలో విజయానంద్
- సివిల్ సప్లైస్ ఎండీగా వీరపాండియన్ కు పోస్టింగ్
- ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా దాస్ కు అదనపు బాధ్యతలు
ఇక ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అనారోగ్యం బారిన పడగా... ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ కు సీఎస్ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.