వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే దాస్ బహిష్కరణ
- 2009లో పామర్రు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దాస్
- ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన వైనం
- 2019 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరిక
- పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న వైసీపీ
పామర్రు నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దాస్... ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా దాస్ పై ఫిర్యాదులు వచ్చినట్లు వైసీపీ తెలిపింది. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టి పార్టీ అధినేతకు నివేదిక అందించగా... దాస్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని జగన్ ఆదేశించినట్లుగా వైసీపీ తన ప్రకటనలో తెలిపింది.