ఆలూరు నియోజకవర్గ నేతలతో జగన్ భేటీ... ఈ రోజు నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు
- ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరి జయరాం
- ఏడాదిన్నరలోనే ఎన్నికలు వస్తున్నాయన్న జగన్
- కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీకి విజయం దక్కుతుందని సూచన
ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయని చెప్పిన జగన్... ఈ రోజు నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ విజయం సాధిస్తుందని ఆయన సూచించారు. గడచిన మూడేళ్లలో ఆలూరు నియోజకవర్గంలోని ప్రజలకు వివిధ పథకాల ద్వారా రూ.1,050 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని జగన్ చెప్పారు. ఇదే విషయాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని ఆయన నియోజకవర్గ నేతలకు సూచించారు.