ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు వరుస ఎదురుదెబ్బలు.. దీపక్ చాహర్ ఔట్!
- ఆటగాళ్లను వేధిస్తున్న గాయాలు
- జడేజా, బుమ్రా.. ఇప్పుడు చాహర్ దూరం
- షమీ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్‌లు ఆస్ట్రేలియాకు
దీపక్ చాహర్ పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ సాధించేందుకు సమయం చాలానే పడుతుందని, అతడి వెన్ను సమస్య మళ్లీ తీవ్రమైందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో షమీ, శార్దూల్, సిరాజ్‌లను ఆస్ట్రేలియా పంపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. కాగా, గాయపడి జట్టుకు దూరమైన బుమ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చే చాన్స్ సీనియర్ అయిన షమీకే ఎక్కువగా ఉంది.