కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యం!... ఈ నెల 17న పోలింగ్!
- కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఖర్గే, థరూర్
- నేటితో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- ఈ నెల 17న ఎన్నికలు నిర్వహిస్తామన్న మిస్త్రీ
- 19న ఓట్ల లెక్కింపు. ఆపై విజేతను ప్రకటిస్తామని వెల్లడి
ఈ మేరకు పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ శనివారం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారని, దీంతో ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ను ఈ నెల 17న నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. పోలింగ్ తర్వాత ఈ నెల 19న ఢిల్లీలో ఓట్ల లెక్కింపును చేపట్టి అదే రోజు విజేతను ప్రకటిస్తామని తెలిపారు.