దీపక్ చాహర్ ప్లేస్‌లో వన్డే జట్టులోకి వాషింగ్టన్ సుందర్
- దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో గాయపడ్డ చాహర్
- చాహర్‌ను వన్డే జట్టు నుంచి తప్పించిన బీసీసీఐ
- సుందర్‌తో చాహర్ స్థానాన్ని భర్తీ చేసిన వైనం
దక్షిణాఫ్రికాతో టీమిండియా 3 మ్యాచ్‌లతో కూడిన వన్డే సిరీస్‌ను ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఓ మ్యాచ్ పూర్తి కాగా... అందులో భారత్‌పై దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక మిగిలిన రెండు వన్డేలకు వాషింగ్టన్ సుందర్ జట్లుకు అందుబాటులో ఉండనున్నాడు.