మరో భారీ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల
- బోయపాటి-రామ్ సినిమాలో హీరోయిన్‌గా ఖరారు
- అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్
- రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైన షూటింగ్
కాగా, ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. రెగ్యులర్ షూటింగ్ నిన్ననే రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. మొదట యాక్షన్ ఎపిసోడ్స్ తీయనున్నారు. ముప్ఫై రోజుల పాటు ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేశాడు దర్శకుడు బోయపాటి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలోనూ ఏకకాలంలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల గ్లామర్ పాత్రలో కనిపిస్తోందని వినికిడి. ఇప్పటికే ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. బాలకృష్ణ, అనిల్ రావిపూడి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అదే సమయంలో నితిన్, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.