భార్యను మై క్వీన్ అంటూ విడాకుల వార్తను ఖండించిన బాలీవుడ్ స్టార్ హీరో
- దీపిక, రణ్ వీర్ సింగ్ దంపతులు విడిపోతున్నారంటూ బాలీవుడ్‌లో పుకార్లు
- ఇప్పటికే ఇరువురు ఖండించినా ఆగని ప్రచారం
- తాజాగా ట్విటర్ పోస్ట్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చిన రణ్‌వీర్
అయితే, సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తమ ప్రేమను చూపిస్తూ ఈ వార్తలను రణ్‌వీర్, దీపిక ఖండిస్తూనే ఉన్నారు. అయినా అవి అగడం లేదు. తాజాగా రణ్ వీర్ ఈ పుకార్లకు మరోసారి పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. తన భార్య దీపికను మై క్వీన్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. దీపిక ఈ మధ్యే ఆభరణాలు, గడియారాలు తయారు చేసే ప్రముఖ బ్రాండ్ కార్టియర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని కార్టియర్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. దీనిపై రణ్‌వీర్ స్పందించాడు. "మై క్వీన్! నాకు చాలా గర్వంగా ఉంది" అని కామెంట్ పెట్టాడు. దాంతో, ఈ జంట విడిపోతుందన్న పుకార్లకు మరోసారి చెక్ పెట్టినట్టయింది. ఇప్పటికైనా అలాంటి వార్తలు ఆగుతాయో లేదో చూడాలి.