విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్
- అక్టోబరు 5న దసరా
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
- ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని ఆకాంక్ష
లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, దుష్ట శక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటున్నామని సీఎం జగన్ వివరించారు.
జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం జగన్ వివరించారు.