బాలయ్య 'అన్ స్టాపబుల్' నుంచి రేపు టీజర్ రిలీజ్!
- గతంలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న 'అన్ స్టాపబుల్'
- త్వరలో పలకరించనున్న 'అన్ స్టాపబుల్ 2'
- విజయవాడ వేదికగా టీజర్ లాంచ్
- ముగింపు దశలో గోపీచంద్ మలినేని మూవీ
- త్వరలో మొదలుకానున్న అనిల్ రావిపూడి సినిమా
అలాంటి ఈ షోకి సీజన్ 2 మొదలు కానుందనే టాక్ కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ షోకి సంబంధించిన టీజర్ ను రేపు రిలీజ్ చేయనున్నారు. విజయవాడ వేదికగా టీజర్ ను వదలనున్న విషయాన్ని తెలియజేస్తూ, పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సారి ఈ షోను మరింత కొత్తగా డిజైన్ చేశారనే విషయం పోస్టర్ ను చూస్తుంటేనే అర్థమవుతోంది.
మరి ఈ సారి ఎవరెవరు ఈ వేదికపై సందడి చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. బాలయ్య సినిమాల విషయానికి వస్తే, గోపీచంద్ మలినేని దర్శకత్వంలోని సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఆ తరువాత సినిమాను ఆయన అనిల్ రావిపూడితో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి
.