రాముడి పాత్రలో నటించేందుకు తొలుత నేను ఒప్పుకోలేదు: ప్రభాస్
- తొలి మూడు రోజులు రాముడి పాత్రను పోషించేందుకు ఒప్పుకోలేదన్న ప్రభాస్
- రాముడిపై భక్తి, భయంతోనే ఈ సినిమాలో నటించానని వ్యాఖ్య
- నిన్న అయోధ్య రాముడిని దర్శించుకున్న సినిమా యూనిట్
అయోధ్యలో టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ... రాముడి పాత్రను పోషించేందుకు తొలి మూడు రోజులు తాను ఒప్పుకోలేదని చెప్పారు. అయితే రాముడిపై ఉన్న భక్తి, భయమే 'ఆదిపురుష్'లో నటించేలా చేశాయని అన్నారు. ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడని చెప్పారు. మరోవైపు ఈ సినిమా యూనిట్ సభ్యులు అయోధ్యలోని రాముడిని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.