వైసీపీ ఎమ్మెల్సీతో కలిసి షాపింగ్ మాల్ ప్రారంభించిన బీజేపీ నేత సత్యకుమార్
- వైసీపీని పీఎఫ్ఐతో పోల్చిన బీజేపీ నేత సత్యకుమార్
- కాసేపటికే వైసీపీ ఎమ్మెల్సీతో కలిసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన బీజేపీ నేత
- ఫొటోలను తానే స్వయంగా విడుదల చేసిన సత్యకుమార్
ఆ తర్వాత గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన శుభమస్తు షాపింగ్ మాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌తో కలిసి ఆయన షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. సత్యకుమార్, డొక్కా మాణిక్య వరప్రసాద్ పక్కపక్కనే నిలుచుని మరీ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఈ ఫొటోలను సత్యకుమారే తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.