ఇకపై కారులో 6 ఎయిర్ బ్యాగులు తప్పనిసరి... ఎల్లుండి నుంచే అమల్లోకి నిబంధన
- కారు ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చుని ప్రాణాలు విడిచిన సైరస్ మిస్త్రీ
- ప్రమాదంపై సమగ్ర అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం
- వెనుక సీట్లలో కూర్చున్న వారి భద్రతపై దృష్టి సారించిన వైనం
- కారులో 6 ఎయిర్ బ్యాగులతో అందరికీ భద్రత లభిస్తుందన్న భావన
- అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనల అమల్లోకి వస్తుందన్న గడ్కరీ
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో కారు వెనుక సీట్లో కూర్చున్నా... మిస్త్రీ చనిపోయారు. ఈ ప్రమాదంపై సమగ్ర అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం...ఇకపై జరిగే ప్రమాదాల్లో ముందు సీట్లలో కూర్చున్న వారే కాకుండా వెనుక సీట్లలో కూర్చున్న వారు కూడా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సరికొత్త నిబంధనను అమలులోకి తీసుకువచ్చింది.