అల్లరి నరేశ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు!
- అల్లరి నరేశ్ హీరోగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'
- మారేడుమిల్లి నేపథ్యంలో నడిచే కథ
- కథానాయికగా ఆనంది
- నవంబర్ 11వ తేదీన సినిమా విడుదల
హాస్య మూవీస్ - జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. నవంబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.
ఈ సినిమాలో అల్లరి నరేశ్ జోడీగా ఆనంది అలరించనుంది. 'జాంబీ రెడ్డి' .. 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఈ సినిమాలో సందడి చేయనుంది. వెన్నెల కిశోర్ .. చమ్మక్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
.