ఓఎంసీ కేసులో మంత్రి సబిత, ఐఏఎస్ శ్రీలక్ష్మీ డిశ్చార్జీ పిటిషన్లను కొట్టివేయాలన్న సీబీఐ.. విచారణ రేపటికి వాయిదా
- నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఓఎంసీ కేసు విచారణ
- సబిత, శ్రీలక్ష్మీ, దేవానందం, రాజగోపాల్‌ల డిశ్చార్జీ పిటిషన్లపై విచారణ
- నిందితులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న సీబీఐ
- నిందితుల వివరణ కోసం విచారణను గురువారానికి వాయిదా వేసిన కోర్టు
ఈ కేసులో ఈ నలుగురు నిందితులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పిన సీబీఐ.. అందుకు తగ్గ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలు ముగియడంతో నిందితుల తరఫు వివరణ కోసం విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. నిందితుల వివరణ తెలియజేశాక ఈ వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించనుంది.