మణిరత్నంకు నో అనే సమాధానమే నచ్చదంటున్న హీరో కార్తీ
- దిగ్గజ దర్శకుడిపై ప్రశంసలు కురిపించిన హీరో
- మణి కలల ప్రాజెక్టు పీఎస్1లో ప్రధాన పాత్ర పోషించిన కార్తీ
- ఆ ప్రాజెక్టు కోసం మణిరత్నం 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారన్న హీరో
”మణి సార్‌లో నేను చూసిన గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎప్పుడూ ప్రయత్నాన్ని విరమించరు. అనుకున్నది చేసి తీరుతారు. దీనికి ఈ చిత్రమే ఉదాహరణ. 40 సంవత్సరాలుగా దీన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, చాలా సార్లు ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా ఆయన పట్టు వదల్లేదు. ఒక ప్రాజెక్టు కోసం ఎవరైనా ఇన్ని సంవత్సరాలు వేచి చూస్తారంటే ఊహించుకోవడమే కష్టం.
ఈ తరంలో మనం ఏ విషయానికైనా 6 నెలల కంటే ఎక్కువ సమయం వెచ్చించం. అది కాకపోతే ఇంకోటి అనుకుంటాం. అందుకే గొప్ప విషయాలు సులభంగా రావు. సుదీర్ఘ కాలం కష్టపడితేనే అది సాధ్యం అవుతుంది. అది ఈ సినిమాకు పని చేస్తున్నప్పుడు నేర్చుకున్న విషయం. ఇతరులు నా గురించి ఏం మాట్లాడుతున్నారో ఆలోచించవద్దని మణి సార్ నాకు చెప్పారు. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు” అని కార్తీ చెప్పుకొచ్చాడు.