రేపే ఏపీ అసెంబ్లీ ముందుకు పెగాసస్ కమిటీ నివేదిక
- టీడీపీ హయాంలో పెగాసస్ పరికరాలను కొనుగోలు చేసినట్లు ఆరోపణ
- భూమన నేతృత్వంలో హౌజ్ కమిటీని ఏర్పాటు చేసిన స్పీకర్
- ఆయా శాఖల అధికారులను విచారించిన కమిటీ
- 85 పేజీలతో నివేదికను రూపొందించిన వైనం
- టీడీపీ సర్కారు పెగాసస్ పరికరాలు కొనుగోలు చేసిందని నిర్ధారణ?
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఆయా శాఖలకు చెందిన అధికారులను విచారించింది. ఆయా శాఖల వద్ద ఉన్న ఆధారాలను కూడా సేకరించింది. అధికారుల విచారణ, ఆధారాల సేకరణలతో మొత్తంగా 85 పేజీలతో కమిటీ తన నివేదికను రూపొందించింది. టీడీపీ ప్రభుత్వం పెగాసస్ పరికరాలను కొనుగోలు చేసినట్టు కమిటీ తేల్చినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ నివేదిక నేపథ్యంలో రేపటి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగనున్నాయి.