‘శాసన సభ’ సినిమాలో హెబ్బా పటేల్ స్టెప్పులు!
- మరోసారి ప్రత్యేక గీతానికి ఓకే చెప్పిన హెబ్బా
- ‘శాసనసభ’ చిత్రంలో ఐటమ్ సాంగ్
- ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వం
‘శాసనసభ’ అనే ప్యాన్ ఇండియా సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్నాడు. ఇప్పటికే పాట చిత్రీకరణ షూట్ పూర్తయిందని, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసినట్టు తెలిపారు. హెబ్బా స్టెప్పులు అదిరిపోతాయని చెప్పారు. రవి బస్రూర్ స్వరాలు అందించిన ఈ స్పెషల్ సాంగ్‌ను మంగ్లీ పాడింది. త్వరలోనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈచిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.