వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించరాదు: ఏపీ ఎస్ఈసీ మీనా ఆదేశాలు
- జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో ఎస్ఈసీ సమావేశం
- వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించిన ఏ పనులూ అప్పగించొద్దని సూచన
- ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నా వారి సేవల వినియోగం వద్దని వివరణ
గ్రామ, వార్డు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయొద్దని ఆయన సూచించారు. వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించిన ఏ పనులను అప్పగించవద్దని ఆదేశించారు. ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నందున వారిని భాగస్వాములను చేయొద్దని కూడా మీనా ఆదేశాలు జారీ చేశారు.