రీ షూట్ దిశగా నిఖిల్ '18 పేజెస్'?
- నిఖిల్ హీరోగా రూపొందిన '18 పేజెస్'
- నిర్మాణ భాగస్వామిగా ఉన్న సుకుమార్
- కొన్ని సన్నివేశాల పట్ల అసంతృప్తి
- రీ షూట్ కి నిఖిల్ ఓకే అంటూ టాక్
ఎప్పుడో పూర్తయిందని చెప్పిన ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఇప్పట్లో ఉండకపోవచ్చనే టాక్ ఒకటి బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయాలనే నిర్ణయానికి రావడమే అందుకు కారణమని అంటున్నారు.
ఇటీవలే ఈ సినిమాను సుకుమార్ చూశాడట. కొన్ని సన్నివేశాల విషయంలో ఆయన అంతగా సంతృప్తి చెందకపోవడంతో, ఆ సీన్స్ ను రీ షూట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. నిఖిల్ కూడా ఆ సీన్స్ మళ్లీ చేయడానికి ఓకే చెప్పాడని అంటున్నారు. 'కార్తికేయ 2' తరువాత నిఖిల్ - అనుపమ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మరింత జాగత్త తీసుకుంటున్నారన్న మాట.