కొనసాగుతూనే ఉన్న 'కార్తికేయ 2' ప్రభంజనం!
- ఆగస్టులో థియేటర్లకు వచ్చిన 'కార్తికేయ 2'
- తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్
- నార్త్ నుంచి భారీ వసూళ్లు
- 120 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటిన సినిమా
ఈ సినిమా కథ అంతా కూడా శ్రీకృష్ణుడు తిరుగాడిన ద్వారక .. మధుర .. బృందావనం .. గోవర్ధనగిరి వంటి క్షేత్రాలలో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ నుంచి కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 రోజులలో 120 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టడం విశేషం.
ఇప్పటికీ కూడా ఈ సినిమా 1000కి పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండటం విశేషం. ఈ సినిమా తరువాత ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు, అటు నార్త్ లోను చాలానే సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఒక విశేషమైతే, ఇంకా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ ఉండటం మరో విశేషం.
.