భూమా మౌనికతో కలిసి కనిపించిన నటుడు మంచు మనోజ్.. పెళ్లి వార్తలపై త్వరలో చెబుతానన్న మోహన్‌బాబు తనయుడు
- సికింద్రాబాద్‌లో గణేశ్ మండపంలో మౌనికతో కలిసి పూజలు
- పెళ్లి, రాజకీయ ప్రవేశంపై అడిగిన ప్రశ్నలకు సమాధానాల దాటవేత
- అహం బ్రహ్మస్మి సినిమా ఆలస్యానికి కారణం చెప్పిన మనోజ్
పూజల అనంతరం విలేకరులు మనోజ్‌ను ఈ విషయమై ప్రశ్నించారు. ఈ సందర్భంగా పెళ్లి, సహా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ప్రశ్నలకు సమాధానాలను దాటవేసిన మనోజ్.. త్వరలోనే తన వివాహం, రాజకీయ ప్రవేశంపై వెల్లడిస్తానని చెప్పారు. అలాగే, ఆయన నటిస్తున్న ‘అహం బ్రహ్మస్మి’ సినిమా ఆగిపోవడానికి కారణం చెప్పారు. కరోనా కారణంగానే సినిమా ఆగిందని అన్నారు. ప్రస్తుతం తాను, ఆ సినిమా దర్శకుడు వేరే సినిమాలతో బిజీగా ఉన్నామని, అందుకే ఆలస్యమవుతోందని మనోజ్ చెప్పుకొచ్చారు.