అలీ, పోసాని కృష్ణమురళికి త్వరలోనే పదవులు ఇవ్వనున్న జగన్?
- అలీకి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి
- పోసానికి ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి
- ఇద్దరికీ ఒకేసారి పదవులు ఇవ్వాలనే యోచనలో సీఎం
అలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా, పోసానిని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎం వద్ద ఉందని సమాచారం.
అలీ విషయంలో గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆయనను రాజ్యసభకు పంపబోతున్నారంటూ ఒకసారి, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ చేస్తారంటూ మరోసారి ప్రచారం జరిగింది. పోసానికి కూడా పదవిని ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు వీరిద్దరికీ ఒకేసారి పదవులు ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నట్టు చెపుతున్నారు.