నిన్నటి మ్యాచ్ లో త్రివర్ణ పతాకాన్ని తీసుకునేందుకు జై షా నిరాకరించడంపై ప్రకాశ్ రాజ్ స్పందన
- నిన్న ఆసియా కప్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
- విజయం సాధించిన భారత్
- త్రివర్ణ పతాకాన్ని జై షాకు ఇవ్వబోయిన వ్యక్తి
- సున్నితంగా తిరస్కరించిన జై షా
దీనిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. "ప్రియమైన మహానేత, హోంమంత్రి... జై షా తన దేశభక్తిని నిరూపించుకోవడానికి జాతీయ జెండాను చేతిలోకి తీసుకుని ఊపేందుకు నిరాకరించారు. ఒకవేళ బీజేపీయేతర వ్యక్తో, హిందుయేతరుడో, నాలాగా మిమ్మల్ని ప్రశ్నించేవాడో ఇలాగే చేసుంటే మీరు, మీ బీజేపీ భక్తులు ఎలా స్పందించేవారు?" అంటూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.