అలయన్స్ ఎయిర్ సంస్థపై నటుడు బ్రహ్మాజీ ఆగ్రహం
- చండీగఢ్ నుంచి కులూ వెళ్లే విమానం కోసం బ్రహ్మాజీ వెయిటింగ్
- మూడు గంటలకు పైగా నిరీక్షణ
- ఇంకా ఎయిర్ పోర్టులోనే ఉన్నానని బ్రహ్మాజీ వెల్లడి
- కనీసం ప్రకటన కూడా చేయలేదని అసంతృప్తి
తాను ఇంకా ఎయిర్ పోర్టులోనే ఉన్నానని వెల్లడించారు. జరిగిన ఆలస్యానికి అలయన్స్ ఎయిర్ కనీసం క్షమాపణలు చెప్పకపోగా, కనీసం ఓ ప్రకటన కూడా చేయలేదని బ్రహ్మాజీ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు. తన ట్వీట్ కు అలయన్స్ ఎయిర్ ను, కేంద్ర విమానయాన శాఖ మంత్రిని ట్యాగ్ చేశారు.
అనంతరం మరో ట్వీట్ లో స్పందిస్తూ, ఎట్టకేలకు 5 గంటల ఆలస్యం అనంతరం కులూ చేరుకున్నానని వెల్లడించారు.