మహేశ్ మూవీతో తరుణ్ రీ ఎంట్రీ!
- బాలనటుడిగా తరుణ్ ఎంట్రీ
- ఒకానొక దశలో హీరోగా విపరీతమైన క్రేజ్
- వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీకి దూరం
- కీలకమైన పాత్ర కోసం తీసుకున్న త్రివిక్రమ్
త్రివిక్రమ్ తన సినిమాలలోని ముఖ్యమైన పాత్రలలో సీనియర్ హీరోలను .. హీరోయిన్స్ ను తీసుకుంటూ ఉంటాడు. అలా ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఆయన తరుణ్ ను తీసుకున్నట్టుగా సమాచారం. బాలనటుడిగా .. హీరోగా తెలుగులో తరుణ్ మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన వరుస పరాజయాల కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు.
అలాంటి తరుణ్ మళ్లీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా చెబుతున్నారు. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్, తరుణ్ సినిమా 'నువ్వే నువ్వే'తోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలాంటి త్రివిక్రమ్ సినిమాతోనే తరుణ్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది.