దూసుకుపోతున్న 'కోబ్రా' తెలుగు టీజర్!
- విక్రమ్ హీరోగా రూపొందిన 'కోబ్రా'
- కథానాయికగా శ్రీనిధి శెట్టి
- కీలకమైన పాత్రలో ఇర్ఫాన్ పఠాన్
- ఈ నెల 31వ తేదీన సినిమా రిలీజ్
నిన్న ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ ను వదిలారు. విక్రమ్ తో పాటు ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తించింది. చాలా ఫాస్టుగా ఈ టీజర్ 3 మిలియన్ ప్లస్ వ్యూస్ ను దక్కించుకోవడం విశేషం. ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా అనిపించేలా ఉంది. విక్రమ్ ఎప్పటిలానే విలక్షణమైన నటనను కనబరిచాడు.
ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్టుగా టీజర్ ను చూస్తేనే తెలుస్తోంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్, ఈ సినిమాతో ఆ నిరీక్షణ ఫలిస్తుందని భావిస్తున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ .. కేఎస్ రవికుమార్ .. సత్యదేవ్ .. మృణాళిని రవి .. మియా జార్జ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.