మహేశ్ మూవీకి ఫైట్స్ హైలైట్!
- మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు
- రంగంలోకి దిగిన ప్రముఖ ఫైట్ మాస్టర్లు
- వచ్చే ఏప్రిల్ 28వ తేదీన సినిమా రిలీజ్
అందుకు తగినట్టుగానే ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రముఖ ఫైట్ మాస్టర్లు అన్బు - అరివు రంగంలోకి దిగిపోయినట్టుగా చెబుతున్నారు. వాళ్లు కంపోజ్ చేసిన ఫైట్స్ 'కేజీఎఫ్' .. 'కేజీఎఫ్ 2' .. 'విక్రమ్' వంటి సినిమాల సక్సెస్ లో ముఖ్యమైన పాత్రను పోషించాయి. శంకర్ - చరణ్ సినిమాకి కూడా వాళ్లే యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తూ వస్తున్నారు.
అలాంటి వాళ్లిద్దరూ కూడా మహేశ్ సినిమా కోసం కొత్తగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాకి ఫైట్స్ హైలైట్ గా ఉండాలనే త్రివిక్రమ్ చెప్పినట్టుగా సమాచారం. మహేశ్ సరసన కథానాయికగా పూజ హెగ్డే అలరించనున్న ఈ సినిమాను, వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నారు.