విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్
- 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన ధనుష్, ఐశ్వర్య
- స్కూల్ స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికైన పెద్ద కొడుకు యాత్ర
- ఆ ఈవెంట్ ను చూసేందుకు వెళ్లిన ధనుష్, ఐశ్వర్య
ధనుష్, ఐశ్వర్యలకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు యాత్ర, రెండో కొడుకు పేరు లింగా. తాజాగా యాత్రకు సంబంధించిన కార్యక్రమం కోసం వీరిద్దరూ అతని స్కూల్ కు వెళ్లారు. పెద్ద కొడుకు యాత్ర స్పోర్ట్స్ కెప్టెన్ అవడంతో... వీరిద్దరూ దగ్గరుండి ఆ ఈవెంట్ ను వీక్షించారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.