మహేశ్ తో సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే: రాజమౌళి
- మహేశ్ 28వ సినిమాకి మొదలైన సన్నాహాలు
- వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు
- 29వ సినిమా రాజమౌళితో
- వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్ పైకి
ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే ప్రచారం జరుగుతున్నప్పుడు, అందులో వాస్తవం లేదని రాజమౌళి స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక వేదికపై ఆయన ఈ సినిమాను గురించి మరోసారి ప్రస్తావించారు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు జరుగుతుందనీ, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చనున్నారు. తన 29వ సినిమాను త్రివిక్రమ్ తో చేయనున్న మహేశ్, రాజమౌళి ప్రాజెక్టు మొదలయ్యేనాటికి రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడన్న మాట.